KMM: సత్తుపల్లి ట్రాలీ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. యూనియన్ మాజీ అధ్యక్షుడు నందు నాయక్ పాల్గొని మాట్లాడారు. ట్రాలీ ఆటో యూనియన్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణను రూపొందించామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వరకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఆటో కార్మికులకు రూ. 12 వేలు ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.