India vs Australia 2nd Test: కష్టాల్లో టీమిండియా..కోహ్లీ ఒంటరి పోరాటం
ఆస్ట్రేలియాతో టీమిండియా(India vs Australia) రెండో టెస్టులో తలపడుతోంది. రెండో టెస్టు(2nd Test)లో భాగంగా టీమిండియా శనివారం లంచ్ బ్రేక్ సమయానికి కష్టాల్లో పడింది. నేడు 29/0తో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా(Team India) లంచ్ బ్రేక్ సమయానికి 88/4 స్కోరు చేసింది.
ఆస్ట్రేలియాతో టీమిండియా(India vs Australia) రెండో టెస్టులో తలపడుతోంది. రెండో టెస్టు(2nd Test)లో భాగంగా టీమిండియా శనివారం లంచ్ బ్రేక్ సమయానికి కష్టాల్లో పడింది. నేడు 29/0తో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా(Team India) లంచ్ బ్రేక్ సమయానికి 88/4 స్కోరు చేసింది. వరుస వికెట్ల పతనంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్నాడు. కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తూ స్కోరును ముందుకు నడుపుతున్నాడు. కోహ్లీ(Virat Kohli)కి తోడుగా రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇద్దరూ మంచి సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతున్నారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 175 రన్స్ వెనకబడి ఉంది.
Lunch on Day 2 of the 2nd Test#TeamIndia 88/4, trail by 175 runs.
ఇకపోతే నేడు ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 13తో బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ శర్మ(Rohith sharma) 69 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఆసీస్ స్పిన్నర్ అయిన నాథన్ లయన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రాహుల్ వికెట్ ను కూడా నాథన్ లయన్ పడగొట్టాడు. ఈ టెస్ట్ సిరీస్ లో 100వ మ్యాచ్ ఆడుతున్న చతేశ్వర్ పుజారా ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా 4 పరుగులు చేసి లయన్ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు.
టీమిండియా కొన్ని నిమిషాల్లోనే 29/0 నుంచి 66/4కు చేరుకుంది. తక్కువ స్కోరుతో వెనకబడి ఉన్న టీమిండియాను ఒక దశలో విరాట్ కోహ్లీ ఆదుకుంటూ వస్తున్నాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకుని కోహ్లీ(Virat Kohli) మెల్లగా స్కోర్ ను పెంచుతున్నాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja)తో కలిసి సహనంతో డిఫెన్స్ ఆడుతూ కొనసాగుతున్నాడు. మరోవైపు నాగ్ పూర్ టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సైతం అదే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 120/4గా ఉంది.