ఈసారి IPL మెగా ఆక్షన్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అమ్ముడుపోలేదు. సుదీర్ఘకాలం పాటు అంటిపెట్టుకున్న సన్ రైజర్స్ కూడా ఈ దఫా వారిని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. 2024లో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. వయస్సు 38 సం.లకు చేరుకోవడం, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగడం వంటి కారణాలతో.. ఏ టీమ్ అతణ్ని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు.