AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనుకోవడానిలేదన్నారు. ప్రత్యామ్నాయాలపై దృస్టి సారించి కసరత్తు చేస్తున్నామన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలను ప్రతిపాదనల్లో కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డొస్తున్నాయన్నారు.