NZB: జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి ఇన్ ఫ్లో 7,970 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం 9 గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ ఫ్లోగా అదే స్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నామన్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను ప్రస్తుతం 1091 అడుగుల (80.501TMC) నీరు నిల్వఉందని తెలిపారు.