AP: వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సాంకేతికతతో అన్నదాతల సాగు ఖర్చులు తగ్గించాలని సూచించారు. ప్రకృతి సేద్యం – అగ్రిడీప్ టెక్ విధానంతో దేశానికి ఏపీ దిక్సూచి అవుతుందని పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా పిచికారీతో 30 శాతానికి పైగా పురుగు మందు ఆదా చేయవచ్చని తెలిపారు. 95 శాతం సమయం, నీరు, పవర్ ఆదా చేసి ఖర్చు తగ్గించవచ్చని, డ్రోన్ల వినియోగంతో సాగులో అనూహ్య ఫలితాలు పొందవచ్చన్నారు.