TG: రుణమాఫీపై మాజీమంత్రి హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి వచ్చాక పాత పథకాలను ఆపేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో అనేక హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చలేదు. మాపై కేసులు పెడితే భయపడం. రుణమాపీ చేయలేదు.. నన్ను రాజీనామా చేయమంటున్నారు. ఇప్పటివరకు 20 లక్షల మందికే రుణమాపీ అయింది’ అని వెల్లడించారు.