AP: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం అధికారులు ప్రయోగాత్మక డ్రోన్ పరీక్ష చేశారు. ఎయిమ్స్ నుంచి 12కి.మీ దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్సీ వరకు డ్రోన్‌ను పంపారు. అక్కడి మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించిన డ్రోన్ తిరిగి ఎయిమ్స్‌కు చేరుకుంది. నమూనాలు తీసుకు రావడం విజయవంతం కావడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.