దేశంలో ఆనాడు విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా బ్రిటీష్ ప్రభుత్వం భారత రక్షణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా పోలీసులకు మరింత అధికారం ఇచ్చింది. అయితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది. 8 ఏప్రిల్ 1929న, భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో సందర్శకుల గ్యాలరీ నుంచి బాంబు విసిరారు. కరపత్రాలు విసిరి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ విప్లవ అనుకూల నినాదాలు చేశారు.