AP: పూటకో మాట మాట్లాడటం మాజీ సీఎం జగన్కు బాగా అలవాటుగా మారిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆఖరి నిమిషంలో తిరుమల పర్యటన ఆపేసుకున్నారని చెప్పారు. నోటీసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని.. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఒక్క నాయకుడినైనా గృహ నిర్బంధం చేశారా? అంటూ ప్రశ్నించారు.