AP: మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. 99 ఏళ్ల వృద్ధుడైన సత్యనారాయణ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా పెదగోగాడలో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. సత్యనారాయణ వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు.