AP: మంత్రి గొట్టిపాటి రవికుమార్ భీమవరంలో పర్యటించారు. ‘గుంతలు లేని రోడ్లు’ కార్యక్రమాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఇన్ఛార్జి మంత్రిగా తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చానాని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ.800 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.