గంగవ్వ రెండు వారాల క్రితం బిగ్ బాస్-8లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్లో ఆమెకు గుండెపోటు వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో గంగవ్వ పక్కనే యాంకర్ విష్ణుప్రియ ఉన్నట్లు.. ఆమెకు చెమటలు పట్టాయని, కంటెస్టెంట్లు తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ వైద్యులను పిలిపించి ట్రీట్మెంట్ అందించినట్లు సమాచారం. కాగా, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.