కెనడాలో బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలీస్థానీ వేర్పాటుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. కెనడాలో హిందూ ఆలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి దాడులతో భారత్ వైఖరిని బలహీనపర్చలేరని స్పష్టం చేశారు. దీనిపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.