TG: ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇటీవల సికింద్రాబాద్లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించామన్న ఈటల.. బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారన్నారు. పారిపోతున్న వారిని పట్టుకుని మరీ పోలీసులు చితకబాదారని విమర్శించారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని మాత్రమే కాంక్షిస్తుందన్నారు.