గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఉత్పత్తులు, చేనేత, హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించే లక్ష్యంతో కేంద్రం ‘ఈ-విక్రయ్’ పోర్టల్‌ను రూపొందిస్తోంది. ఈ-కామర్స్ సంస్థలతో పోలిస్తే ఈ-విక్రయ్ భిన్నంగా ఉండనుంది. ‘భారత్‌లోని అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా సులువుగా వినియోగించుకోవచ్చు. ఈ పోర్టల్‌ను త్వరలో మొబైల్ యాప్‌గా పునరుద్దరిస్తాం’ అని రూపకర్తలు పేర్కొన్నారు.