TG: ఇవాళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఉదయం 9:30 గంటలకు నెక్లెస్ రోడ్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఇందిరాకు నివాళులర్పించనున్నారు. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నివాళులర్పించనున్నారు.