AP: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఆలయాలకు క్యూ కట్టారు. ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమల పవిత్రతతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారని, పాప ప్రక్షాళన కోసమే పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గుంటూరులో మాజీ మంత్రులు అంబటి, రజిని పూజలు చేశారు. అలాగే విజయవాడలో దేవినేని అవినాష్, తిరువూరులో స్వామిదాస్, కడపలో రవీంద్రనాథ్ పూజల నిర్వహించారు.