AP: వైసీపీ హయాంలో రూ.వందల కోట్ల విలువైన ఆలయ ఆస్తులు కబ్జా చేశారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆలయాల్లో అర్చకులకు వేతనాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అర్చకులకు వేతనాలు వచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నదుల అనుసంధానం లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేసి తీరుతామని, బొల్లాపల్లి రిజర్వాయర్‌తో పల్నాడును సస్యశ్యామలం చేస్తామన్నారు.