TG: హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లిలో మరణించిన మహిళ బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ సర్కార్ చేసిన హత్యేనని ఆరోపించారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో సర్కార్ చేస్తున్న విధ్వంసం ఆపేయాలని డిమాండ్ చేశారు. కాగా, హైడ్రా తమ ఇళ్లు కూల్చివేస్తుందన్న భయంతో బుచ్చమ్మ సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.