రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం ఉక్రెయిన్లోకి వెళ్తుందని దక్షిణ కొరియా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. ఉత్తరకొరియా సైన్యాన్ని ఉక్రెయిన్లోకి పంపించినట్లు, అదనపు సైన్యాన్ని కూడా రష్యాకు సహాయంగా మోహరిస్తున్నట్లు సమాచారం వచ్చిందని ఐక్యరాజ్యసమితి US రాయబారి తెలిపారు. ఒకవేళ అదే నిజమైతే ఆ చర్య చాలా ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఇది అత్యంత ఆందోళనకర పరిణామం అవుతుందని వెల్లడించారు.