TG: ఎలక్ట్రిక్ ఆటోలు కొని నడుపుకునేలా మహిళల్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఒక పథకాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధిస్తారని అంచనా వేస్తోంది. ఇప్పటికే మహిళలు.. స్వయం సహాయక సంఘాల్లో చేరి.. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులను కొని, ఆర్టీసీకే అద్దెకు ఇస్తున్నారు.