AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని తెలిపారు. ‘ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంగా చెబుతున్నాం. ప్రైవేటీకరణ వద్దని కేంద్రమంత్రిని కలిసి కోరాను. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరిస్తామంటే మేమే ఆపాం’ అని పేర్కొన్నారు.