AP: విశాఖలో దివంగత సీనియర్ న్యాయవాది ఎంకే సీతారామయ్య చిత్రపటాన్ని సుప్రీంకోర్టు జడ్జి పీఎస్ నరసింహ ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో సీతారామయ్యకు 11 ఏళ్లు అని, స్వతంత్ర భారతంలో జీవించు.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత వచ్చిందన్నారు. సీతారామయ్య ఆదర్శవంతమైన జీవితం గడిపారని, న్యాయవాదిగా విజయవంతంగా రాణించారని గుర్తుచేశారు.