AP: ఏడాదిలోగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. టీడీపీ హయాంలోనే రాయలసీమ అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సాగునీరు, ఇతర ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలోనే వచ్చాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వల్లే అనంతపురానికి కియా వచ్చిందని చెప్పారు. చిత్తూరు, కడప కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వచ్చినట్లు తెలిపారు. టీసీఎల్, ఫాక్స్కాన్ సంస్థలన్నీ రాయలసీమకు వచ్చినట్లు లోకేశ్ పేర్కొన్నారు.