TG: రాష్ట్రంలో ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై నియమించిన కమిషన్ నివేదికను ప్రవేశపెట్టనుంది. దీనిపై సభలో విస్తృత చర్చ జరగనుంది. ఈ నివేదిక, దానిపై జరిగే చర్చ రాష్ట్ర రాజకీయాలకు కీలక అంశం కానుంది.