సుంకాల అంశంలో అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు 25శాతం, చైనా నుంచి దిగుమతులకు 10శాతం సుంకం విధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ట్రూత్ షోషల్’ పేజీలో ట్రంప్ రాసుకొచ్చారు. జనవరి 20న అధ్యక్షుడిగా తన తొలి సంతకం ఈ దస్త్రాలపైనే చేస్తానని వెల్లడించారు.