AP: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోని హుండీలో దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల ఆధారంగా భద్రతా సిబ్బంది విషయాన్ని గుర్తించారు. దీంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడిని తమిళనాడుకు చెందిన వ్యకిగా గుర్తించారు.