అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీని అరెస్ట్ చేసే ధైర్యం మోదీకి ఉందా అని ప్రశ్నించారు. సెకీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టాలన్నారు. కాగా, గౌతమ్ అదానీపై అమెరికాలో ఫ్రాడ్, లంచం కేసు నమోదైంది. 265 మిలియన్ డాలర్ల లంచం కేసులో.. అదానీ మేనల్లుడు సాగర్ అదానీపై ఆరోపణలు వచ్చాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ స్కాం అని అమెరికా పేర్కొంది.