శీతాకాలంలో తేనె తినడం వల్ల అనేక లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో శరీరంలో వచ్చే వాపు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో చక్కగా సహాయపడతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటివి రాకుండా ఉంటాయి. వీటితో పాటు ఎముకలు బలంగా ఉంటాయి. తేనెను చర్మానికి రాసుకుంటే.. కాంతివంతంగా ఉంచుతుంది.