TG: రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. విపక్షాలు చేస్తున్న విమర్శల్లో పస లేదన్నారు. గీతారెడ్డికి సద్భావన సన్మానం చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్గా మహేశ్ కుమార్ ఎన్నిక శుభసూచకమని తెలిపారు. రాజీవ్ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.