TG: రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రూ.18 వేల కోట్లతో తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీఒక్కరికీ మాఫీ చేయనున్నట్లు చెప్పారు. గత సర్కార్ ఎగ్గొట్టిన రుణమాఫీ క్లియర్ చేస్తున్నామని, త్వరలోనే మిగతావి క్లియర్ చేస్తామని తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.