TG: ప్రతిపక్షాలు వాగుడు ఆపాలని CM రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అడ్డగోలు తప్పులను తాము సరిదిద్దుతున్నామని తెలిపారు. BRS ఖాతాలో రూ.1500కోట్లు ఉన్నాయని.. అందులో రూ.500కోట్లను మూసీ పరిధిలోని పేదలకు ఇవ్వాలని సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుందని ప్రశ్నించారు. అఖిలపక్షం భేటీ ఏర్పాటు చేస్తామన్న రేవంత్ రెడ్డి.. వచ్చి సలహాలు ఇవ్వండని KTR, హరీశ్ రావులకు తెలిపారు.