నార్త్ కొరియా రాజధానిలో సౌత్ కొరియా డ్రోన్ ఉన్నట్లు తెలిసిందని నార్త్ కొరియా అధికారులు వెల్లడించారు. ప్యాంగ్యాంగ్లో చేపట్టిన సోదాల్లో డ్రోన్ ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. ఈ నెల ప్రారంభం నుంచి సౌత్ కొరియా సైన్యం మా భూభాగంలోకి డ్రోన్లను పంపిస్తోందనే విషయం ఈ ఘటనతో నిర్ధారణ అయ్యిందని అన్నారు. దీనిపై స్పందించిన సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఈ ఆరోపణలన్నీ పసలేనివని తోసిపుచ్చారు.