AP: కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ భేటీకి ఇరు రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. ఒప్పందం ప్రకారం 8 కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకరించింది. కర్ణాటక ప్రభుత్వానికి పవన్ కృతఙ్ఞతలు తెలిపారు.