TG: ఓ ఎస్సై ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలలో జరిగింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. పెట్రోల్ బంక్ సిబ్బందితో ముగ్గురు యువకులు గొడవపడగా.. పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. తన ముందు యువకులు తలదువ్వుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సై జగన్.. ముగ్గురు యువకులకు గుండు చేయించాడు.