Supreme Court: ఢిల్లీ ప్రభుత్వానికి షాకిచ్చిన సుప్రీం కోర్టు
Supreme Court: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రీజనల్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టుకు నవంబర్ 28లోగా నిధులు మంజూరు చేయాలని ఆదేశించింది.
Supreme Court: ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రీజనల్ ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టుకు నవంబర్ 28లోగా నిధులు మంజూరు చేయాలని ఆదేశించింది. గతంలో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని కోర్టు భావించింది. మొత్తం రూ.415 కోట్ల బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్ నుండి ఈ మొత్తాన్ని ఈ ఏడాదికి మళ్లించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ నుంచి రూ. 550 కోట్లు అటాచ్ చేస్తామని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 20న ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్‌లోని 17 కిలోమీటర్ల విభాగాన్ని ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌గా చరిత్ర సృష్టించారు. మొత్తం 82.15 కి.మీ ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS జూన్ 2025 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
అవివాహిత మహిళలకు సరోగసీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.