»Bank Cleaner Gets Notice Of 16 Crore Loan Payment In Vadodara
Bank Loan: బ్యాంకా మజాకా.. అకౌంటే లేని వ్యక్తికి రూ.కోట్ల రుణం చెల్లించాలని నోటీసు
వడోదర మున్సిపల్ కార్పొరేషన్(Vadodara Municipal Corporation)లో పనిచేస్తున్న ఓ స్వీపర్‌కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు అందుకున్న స్వీపర్ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యారు. వడోదర మెట్రోపాలిటన్ మునిసిపాలిటీలో స్వీపర్(Sweeper)గా పనిచేస్తున్న శాంతిలాల్ సోలంకి(Shanthi lal solanki) ఇంటిని సీజ్ చేయాలంటూ బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది.
Bank Loan: ఇప్పటి వరకు చిన్న చిన్న ఇళ్లకు వేలు లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చాయని వార్తలు విన్నాం. కానీ ఇదో కొత్త వార్త. అసలు బ్యాంకులో అకౌంటే లేని సాధారణ వ్యక్తికి రూ.16కోట్ల రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసు జారీ చేసింది. నోటీస్ అందుకున్న వ్యక్తి అవాక్కయ్యాడు. ఈ ఘటన వడోదరలో చోటుచేసుకుంది. వడోదర మున్సిపల్ కార్పొరేషన్(Vadodara Municipal Corporation)లో పనిచేస్తున్న ఓ స్వీపర్‌కు రూ. 16కోట్ల రుణం చెల్లించాలంటూ ఓ బ్యాంకు నోటీసులు పంపించింది. ఈ నోటీసు అందుకున్న స్వీపర్ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యారు.
వడోదర మెట్రోపాలిటన్ మునిసిపాలిటీలో స్వీపర్(Sweeper)గా పనిచేస్తున్న శాంతిలాల్ సోలంకి(Shanthi lal solanki) ఇంటిని సీజ్ చేయాలంటూ బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. 16 కోట్ల 50 వేల 300 రూపాయల రుణం(loan) రికవరీ బాకీ ఉండడమే ఈ నోటీసుకు కారణం. ఈ చెల్లింపు డిఫాల్ట్‌గా, బ్యాంకు ఇప్పుడు మే 4న వారి ఇంటిని సీజ్ చేయనున్నట్లు పేర్కొంది. అంతకు ముందే ఇళ్లు ఖాళీ చేయాలని.. ఇంటి నుండి వస్తువులను తరలించమని కోరింది. ఇదిలా ఉండగా.. నోటీసు విషయం తెలియగానే అతని భార్య ఆస్పత్రి(Hospital) పాలైంది.
గుజరాత్‌లోని వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ సోలంకి అనే వ్యక్తి తన భార్య జాషి బెన్‌తో రాజ్యలక్ష్మి సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)కు మీరు అప్పు ఉన్నారని, మార్చి 4వ తేదీ లోపు వాటిని చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. రుణం చెల్లించకపోతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. శాంతిలాల్ ఈ నోటీసు గురించి స్థానిక ఎమ్మెల్యే నీరజ్ చోప్రా(MLA Neeraj chopra)ను ఆశ్రయించారు.
ఎమ్మెల్యే బాధితులకు న్యాయం చేయాలని కోరారు. శాంతిలాల్ కుటుంబం మొత్తం ఆస్తులే రూ.5 నుంచి 10 లక్షలు ఉంటాయన్న నీరజ్ చోప్రా.. అలాంటి వారు రూ. 16 కోట్లు ఎలా అప్పు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. నోటీస్‌పై విచారణ జరిపించాలన్నారు. నోటీసులో రుణం పేర్కొన్న ఆస్తికి అషర్ ఇన్ఫ్రా లాజిక్ కంపెనీ యజమానిగా పేర్కొనడం కూడా ఇక్కడ గమనించాలి. దీన్ని బట్టి చూస్తే నోటీసు పంపడంలో బ్యాంకు పొరపాటు పడే అవకాశం బలంగా ఉంది.