రాధిక, డీజే టిల్లు కాంబినేషన్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి డీజె టిల్లు సీక్వెల్లో రాధికను పక్కకు పెట్టేశాడట టిల్లుగాడు. దాంతో క్రేజ్ ఉన్న మరో హాట్ బ్యూటీతో రొమాన్స్ చేసి.. మ్యాజిక్ చేయాలనుకున్నాడు టిల్లుగాడు. అందుకే నేహా శెట్టికి బదులు పెళ్లి సందD ఫేం శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు.. కానీ మేకర్స్ ఈ వార్తలపై మాత్రం స్పందించలేదు. దాంతో టిల్లుగాడితో శ్రీలీల రొమాన్స్ చేయడం నిజమేనని అనుకున్నారు. అయితే ఇప్పుడు టిల్లుగాడికి శ్రీలల బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా షూటింగ్లో జాయిన్ అయిన తర్వాత అని అంటున్నారు. దాంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది .
ముందుగా సిద్ధు జొన్నల గడ్డతో నటించేందుకు ఓకే చెప్పిన శ్రీలీల.. ఇటీవల షూటింగ్లో కూడా పాల్గొందట. అయితే షూట్ స్టార్ట్ అయిన రెండు రోజులకే అమ్మడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. అసలు ఇందులో ఎతంవరకు నిజముందో తెలియదు గానీ.. శ్రీలీల సైడ్ అయిపోవడంతో మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం శ్రీలీల.. రవితేజ సరసన ధమాకా అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇంకొన్ని సినిమాలు సెట్స్ ఉండగా.. కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. అయితే టిల్లుగాడికి ఈ యంగ్ బ్యూటీ ఎందుకు హ్యాండ్ ఇచ్చిందనేది.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా డీజే టిల్లు2లో హీరోయిన్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.