»They Want To Marry Me Within A Week Janhvi Kapoor
Janhvi Kapoor: వారం రోజుల్లోనే నా పెళ్లి చేసేలా ఉన్నారు.. జాన్వీ కపూర్
ఈ మధ్య బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లికి రెడీ అవుతుందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లి రూమర్స్ స్పందించింది అమ్మడు. తన పెళ్లి వారం రోజుల్లోనే చేసేలా ఉన్నారని చెప్పుకొచ్చింది.
They want to marry me within a week.. Janhvi Kapoor
Janhvi Kapoor: గత కొంత కాలంగా శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ ప్రేమలో ఉందనే వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. జాన్వీ, శిఖర్ కలిసి చాలాసార్లు కనిపించారు. తిరుమలకు కూడా ఒకటి రెండు సార్లు కలిసే వచ్చారు. కానీ ఈ విషయం పై ఇద్దరూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ మధ్య ఈ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారనే టాక్ వచ్చినప్పటికీ.. మళ్లీ కొన్నాళ్లకే కలిసిపోయినట్టుగా చెబుతున్నారు. కానీ బయటికి మాత్రం ఓపెన్ అవడం లేదు. అయితే ఇటీవల.. తిరుపతిలో జాన్వీ, శిఖర్ పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ వచ్చాయి. దీంతో.. జాన్వీ తన పెళ్లి వార్తల పై స్పందించింది. ఏదైనా రాసేస్తారా.. అంటూ మండి పడింది. పెళ్లి వార్తల్లో వాస్తవం లేదని జాన్వీ క్లారిటీ ఇచ్చేసింది.
ఇక ఇప్పుడు మరోసారి ఈ వార్తలపై రియాక్ట్ అయింది. రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అనే సినిమాలో నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో మహిమ పాత్రలో జాన్వీ.. మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్ నటించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో.. ప్రస్తుతం ప్రమోషన్లతో బిజీగా ఉంది జాన్వీ. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మడికి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. మీ ప్రియుడు శిఖర్ పహారియాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడగ్గా.. అందుకు జాన్వీ నవ్వుతూ ఆన్సర్ చేసింది. ఈ మధ్య కాలంలో నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రాస్తున్నారు. అంతేకాదు.. నాకు తెలియకుండానే వారం రోజుల్లోనే నా పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం కెరీర్‌పైనే ఉంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు’ అని తెలిపింది.