»Tarakaratna Tharakaratna Two Songs And Cinemas Bumper Hit
Tarakaratna: తారకరత్న ఈ సినిమా, ఈ పాటలు ఇప్పటికీ వినసొంపు…
నటుడు తారకరత్న నటుడిగా అంతగా నిలబడలేక పోయినప్పటికీ ఆయన కొన్ని పాటలు మాత్రం ఎందరినో అలరించాయి. ముఖ్యంగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాలోని నువు చూడూ చూడకపో అనే పాట బాగా క్లిక్ అయింది.
నటుడు తారకరత్న నటుడిగా అంతగా నిలబడలేక పోయినప్పటికీ ఆయన కొన్ని పాటలు మాత్రం ఎందరినో అలరించాయి. ముఖ్యంగా నెంబర్ వన్ కుర్రాడు సినిమాలోని నువు చూడూ చూడకపో అనే పాట బాగా క్లిక్ అయింది. అలాగే తొడగొట్టి చెబుతున్న తొలి మాట అనే పాట కూడా అందరినీ అలరించింది. నువు చూడు చుడకపో అనే పాట ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోని పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. నువు చూడు చూడకపో పాట సోషల్ మీడియాలో, ప్రోగ్రాం లలో బాగా వినిపిస్తుంది. ఈ పాటకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి, గంగా ఆలపించారు. నందమూరి వంశం నుండి వచ్చిన తారకరత్న… హీరోగా నటించడంతో పాటు విలన్ గా, స్పెషల్ రోల్స్ కూడా చేశారు.
అమరావతి సినిమాలో అధ్భుత నటన ప్రదర్శించారు. కెరీర్ లో 20కి పైగా సినిమాలు చేశారు. ఆయన నటించిన సినిమాలలో రెండు మూడు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. అవి ఒకటో నెంబర్ కుర్రాడు, అమరావతి. ఈ రెండు మూవీస్ తారకరత్న కెరీర్ లో చాలా స్పెషల్. తారకరత్న ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. సినిమాలోని ఆరు పాటలు కూడా ఇండస్ట్రీ హిట్స్ కావడం గమనార్హం. అలాగే హీరోగానే కాకుండా తొలిసారి విలన్ గా నటించిన అమరావతి సినిమా ద్వారా కూడా నంది అవార్డు అందుకున్నారు. కాగా నందమూరి తారకరత్న గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.