Pushpa 2: ‘పుష్ప2’ ఒక్క ఇంటర్వెల్ సీన్ కోసం అన్ని రోజులా!?
పుష్ప2పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ పుష్పరాజ్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే పుష్ప2ని ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి.. మూడు నిమిషాల వీడియో రిలీజ్ చేసి.. అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్ ఒకటి అదే చెబుతోంది.
పుష్ప2లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ చూసి అంతా షాక్ అయ్యారు. కానీ నెక్స్ట్ లవెల్ అనేలా ఉంవంటూ.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాలో ఈ లుక్కు సంబంధించిన సీన్స్ పీక్స్‌లో ఉంటాయని ఫిక్స్ అయిపోయారు. అయితే అది క్లైమాక్స్‌లో ఉంటుందని అనుకున్నారు. కానీ మన లెక్కల మాస్టారు లెక్క వేరేలా ఉంది. ఇంటర్వెల్‌కే పూనకాలు తెప్పించబోతున్నాడట. ఈ ఎపిసోడ్‌ను ఎవరు ఊహకందని విధంగా తెరకెక్కిస్తున్నాడట సుకుమార్. జస్ట్ ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్‌ను దాదాపు 35 రోజుల పాటుగా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం బన్నీ, సుకుమార్ చాలానే కష్టపడుతున్నారట.
ఈ లెక్కన పుష్ప2 ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు చూడని ఇంటర్వెల్ బ్యాంగ్‌ని సుకుమార్ చూపించబోతున్నాడట. దీంతో బన్నీ ఫ్యాన్స్ మరింతగా అంచనాలను పెంచేసుకుంటున్నారు. ఈ సినిమాను దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. మళయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి పుష్ప2తో సుకుమార్, అల్లు అర్జున్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.