అవతార్2 సినిమా ఫెస్ట్ మరో వారం రోజుల్లో మొదలు కాబోతోంది. డిసెంబర్ 16న ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో.. అవతార్2 విడుదల అవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఇండియాలో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. అందుకే మూడు వారాల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినా.. టికెట్స్ హాట్ కెకుల్లా అమ్ముడుపోయాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన మూడు రోజుల్లోనే 45 స్క్రీన్లలో 15 వేలకు పైగా ప్రీమియం ఫార్మాట్ టిక్కెట్లు సేల్ అయ్యాయి. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. అన్ని భాషల్లో ప్రీ సేల్స్ అదరిపోయేలా ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఇండియాలో సుమారు 2 లక్షల ఇరవై వేల మంది ‘అవతార్ 2’ టికెట్స్ బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన కలెక్షన్స్ పరంగా చూస్తే… 8 నుంచి 10 కోట్లు వచ్చినట్టు చెబుతున్నారు. దాంతో ఫస్ట్ డే అవతార్2 సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం కాయమంటున్నారు. అయితే ‘అవతార్ 2’కు నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్‌లలో బుకింగ్స్ బావుంటే.. సౌత్ ఇండియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ ఎక్కువగా ఉందని అంటున్నారు. అంటే ఇండియాలో ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే.. దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ 2009లో వండర్స్ క్రియేట్ చేసింది. అందుకే అవతార్ సాధించిన వసూళ్ల రేంజ్లో అవతార్2 బిజినెస్ జరిగిందని అంటున్నారు. దాంతో ఈ సారి బాక్సాఫీస్ దగ్గర సునామీ రాబోతోందని చెప్పొచ్చు. మరి అవతార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.