Pic: Mahesh Babu's Pre-Birthday Vacation in London
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ చాలా కాలంగా వివాదాస్పద వార్తలతోనే వార్తల్లో నిలుస్తోంది. హీరోయిన్ మారిపోవడం, మ్యూజిక్ డైరెక్టర్ పై విమర్శలు, డైరెక్టర్ పై ట్రోల్స్ ఇలానే చాలానే జరిగాయి. మధ్యలో సినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అంతా సర్దుకుపోయి ఎలాంటి బ్రేక్‌లు లేకుండా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశారు.
షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన మహేష్ ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ కి వెళ్లారు. ఆగస్ట్ 14న మహేష్ వెకేషన్ నుంచి తిరిగి రానున్నారు. ఆయన బర్త్ డే ఆగస్టు 9వ తేదీన జరగనుంది. అంటే, ఆయన పుట్టిన రోజు వేడుకలు లండన్ లోనే జరగనున్నాయి. ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ అప్పుడే షురూ చేయడం విశేషం.
నమ్రత ఓ ఫోటో షేర్ చేసింది. ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది, ఫోటోలో వారి స్నేహితులు కూడా ఉన్నారు.
మహేష్ బంబుల్బీ టీ-షర్ట్ ధరించి రిలాక్స్డ్గా, క్యాజువల్‌గా కనిపిస్తున్నాడు. ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా అక్కడ డిన్నర్ చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా రాగానే, గుంటూరు కారం షెడ్యూల్ మళ్లీ ప్రారంభం కానుంది.