»The Woman Who Cut Her Husband And Mother In Law Into Pieces And Hid Them In The Fridge
Crime: భర్త, అత్తని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన మహిళ
ఓ మహిాళ తన ప్రియుడితో సంతోషంగా ఉండటం కోసం భర్త, అత్తని దారుణంగా హత్య(Murder) చేసి రిఫ్రిజిరేటర్లో దాచింది. తన భర్త, అత్తను హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్(Fridge) లో పెట్టిన మూడు రోజులకు మృతదేహాలను మూటగట్టి అసోం, మేఘాలయ బోర్డర్ లో పడేసింది.
వివాహేతర సంబంధాల వల్ల అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ మహిాళ తన ప్రియుడితో సంతోషంగా ఉండటం కోసం భర్త, అత్తని దారుణంగా హత్య(Murder) చేసి రిఫ్రిజిరేటర్లో దాచింది. తన భర్త, అత్తను హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్(Fridge) లో పెట్టిన మూడు రోజులకు మృతదేహాలను మూటగట్టి అసోం, మేఘాలయ బోర్డర్ లో పడేసింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు(Police case) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్(Arrest) చేశారు. పోలీసుల సమాచారం మేరకు..బందోనా కలిత, అమర్ జ్యోతి దేయ్ ఇద్దరూ భార్యభర్తలు. వీరు గౌహతిలోని నూన్మతి ప్రాంతంలో ఉండేవారు.
బందోనాకి చాలా మంది యువకులతో వివాహేతర సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో తన భర్త, అత్త తనకు అడ్డుగా ఉన్నారని భావించి వారిని హత్య(Murder) చేయాలని నిర్ణయించుకుంది. తన ఆలోచనను తనతో వివాహేతర సంబంధం ఉన్న అరుప్ దేకా, దంజిత్ దేకాతో పంచుకుంది. వారిద్దరూ కూడా హత్య(Murder) చేయడానికి సహకరించారు. ముగ్గురు కలిసి తన భర్త, అత్తను హత్య(Murder) చేశారు. డెడ్ బాడీలను ఎవ్వరికీ తెలియకుండా ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టారు.
మూడు రోజుల తర్వాత ఆ శరీర భాగాలను మూటగట్టిన బందోనా అసోం, మేఘాలయ సరిహద్దు ప్రాంతానికి తీసుకెళ్లి వేర్వేరు ప్రదేశాల్లో భాగాలను విసిరేసింది. కుటుంబ సభ్యులు భర్త, అత్తని అడగ్గా తెలియదని చెప్పింది. దీంతో సందేహించిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇన్ని రోజులకు విచారణ జరిపి ఆ కిరాతక కోడలిని సాక్షాధారాలతో సహా పట్టుకున్నారు. పోలీసులు తమ స్టైల్ లో విచారించగా బందోనా తన తప్పును ఒప్పుకుంది. దీంతో బందోనా, ఆమెకు సహకరించిన ఇంకో ఇద్దరినీ గౌహతి పోలీసులు ఆదివారం అరెస్ట్(Arrest) చేశారు.