• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

చెరువులో గుర్తు తెలియని మృతదేహం కలకలం

కోనసీమ: అల్లవరం మండలం బోడసకుర్రులోని నాగమల్లి చెట్టు వద్ద ఉన్న చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. స్థానికులు అల్లవరం పోలీసులకు దీనిపై సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి శరీరంపై ప్యాంటు మాత్రమే ఉందని స్థానికులు తెలిపారు.

December 4, 2024 / 03:15 PM IST

వీరులపాడులో ద్విచక్ర వాహనం దగ్ధం

కృష్ణా: వీరులపాడులో బుధవారం ఉదయం ఓ ద్విచక్ర చక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. గ్రామానికి చెందిన పాలపర్తి వినీత్ అనే వాహన యాజమానుడు తన ఇంటి ముందు వాహనాలు నిలపగా గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేయటంతో వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతయింది. వీరులపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

December 4, 2024 / 03:09 PM IST

రోడ్డు ప్రమాదం.. శబరిమల భక్తుడు మృతి

కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్యన్‌కావు గ్రామంలో అతివేగంగా వచ్చిన లారీ శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ భక్తుడు మృతి చెందారు. చిన్నారులు, వృద్దులతో సహా 16 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప...

December 4, 2024 / 02:55 PM IST

అధ్యాపకుడిపై విద్యార్థిని ఫిర్యాదు

మేడ్చల్: తనను అధ్యాపకుడు వేధిస్తున్నారని ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డబిల్పూర్ గ్రామంలో ఉన్న బైబిల్ కళాశాలలో విద్యార్థిని చదువుతుండగా అదే కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న వినయకుమార్ మానసికంగా, శారీకంగా తనను వేధిస్తున్నాడని కళాశాల డైరెక్టర్ బోజిరెడ్డికి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

December 4, 2024 / 02:34 PM IST

లారీ-ట్రావెల్ బస్సు ఢీ.. డ్రైవర్ మృతి

అన్నమయ్య: రాజంపేట భువనగిరి పల్లి ఆర్చి సమీపంలో లారీ – ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న సంఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. బుధవారం ఉదయం కర్ణాటక లారీని, హైదరాబాద్ వెళ్లే బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు కాలు విరిగింది. బస్సు క్లీనర్, మరో నలుగురు గాయపడ్డారు.

December 4, 2024 / 01:47 PM IST

లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ నుంచి బండ్లగూడకు వెళ్తున్న లారీ, మంగళవారం అర్థరాత్రి గౌడవెళ్లి సమీపంలో ఓఆర్ఆర్‌పై అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో లారీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమవ్వడంతో.. లారీ డ్రైవర్ సందీప్(27) స్పాట్‌లోనే సజీవదహనమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

December 4, 2024 / 01:42 PM IST

కొవ్వూరులో యువకుడు సూసైడ్

W.G: కొవ్వూరు పట్టణంలో యువకుడు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చందన్ బెహరా కొవ్వూరు థియేటర్ సెంటర్ సమీపంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

December 4, 2024 / 01:14 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

MNCL: కోటిపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని పెట్రోల్ పంప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన పాణెం కిరణ్‌(22)గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

December 4, 2024 / 12:44 PM IST

ఆరిలోవలో లారీ దగ్ధం

VSP: విశాఖపట్నం 12వ వార్డులో ఆరిలోవ దరి శ్రీకాంత్ నగర్‌లో పార్క్ చేసి ఉన్న లారీ బుధవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైయింది. ఆరిలోవ ఎస్సై కృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే లారీ చాలా వరకు కాలిపోయింది. కాగా ఇది షార్ట్ సర్క్యూటా.. లేక ఆకతాయిల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

December 4, 2024 / 11:27 AM IST

కూలీల ఆటో బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు

BDK: ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన అశ్వారావుపేట మండలంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వినాయకపురం చిలకల గండి ముత్యాలమ్మ తల్లి సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిందని చెప్పారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

December 4, 2024 / 10:40 AM IST

చంద్రగిరి హైవేపై తప్పిన ప్రమాదం

CTR: చంద్రగిరి హైవేలో ఓ ఇన్నోవా వాహనం ప్రమాదానికి గురైంది. బెంగుళూరు నుంచి తిరుపతికి వెళుతున్న ఇన్నోవా వాహన డ్రైవరు నిద్ర మత్తులో డివెడర్ మధ్య ఉన్న సిగ్నల్ బోర్డును ఢీకొట్టాడు.. దీంతో ఆయన ఎగిరి రోడ్డు పైన పడ్డాడు. డ్రైవర్‌కు ఎలాంటి దెబ్బలు తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడం వలన పెనుప్రమాదం తప్పింది.

December 4, 2024 / 10:28 AM IST

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దుండగులు హత్య చేశారు. నెబ్‌సరాయి ప్రాంతంలో నివాసం ఉంటున్న దంపతులు, వారి కుమార్తెను దారుణంగా హత్య చేశారు. ఆ సమయంలో దంపతుల కుమారుడు వాకింగ్‌కి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

December 4, 2024 / 10:22 AM IST

ఆవులపై పెద్దపులి దాడి.. రెండు ఆవులు మృతి

SKLM: పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో పెద్దపులి దాడి చేసిందని పాతపట్నం అటవీశాఖ సెక్షన్ రేంజర్ పట్ట అమ్మి నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. పెద్దపులి ప్రస్తుతం ఒడిశా ప్రాంతానికి తరలి వెళుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. రెండు ఆవులపై దాడి చేయడంతో మృతి చెందాయని ఆయన స్పష్టం చేశారు.

December 4, 2024 / 10:06 AM IST

తెలంగాణ ఉద్యమకారుడు భాస్కర్‌రావు కన్నుమూత

BDK: తెలంగాణ ఉద్యమకారుడు మోరే భాస్కర్‌రావు శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ బుధవారం మరణించారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కొత్తగూడెం ప్రాంతం నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. 2001లో KCR ప్రారంభించిన TRS పార్టీ తరఫున ఈ ప్రాంతం నుంచి కీలక నేతగా పనిచేశారు. వార్డు కౌన్సిలర్‌గా, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు.

December 4, 2024 / 09:36 AM IST

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. మహారాష్ట్రలోని సిర్వంచ, అహేరి, గచ్చిరోలి, చంద్రపూర్‌లో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్‌లో స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.

December 4, 2024 / 09:20 AM IST