»Brs Mlc Padi Kaushik Reddy Car Accident At Tadikal
Padi Kaushik Reddyకి ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిన కారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురయ్యింది. బైక్‌ను తప్పించబోయి కారు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
BRS MLC Padi Kaushik Reddy Car Accident At Tadikal
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) రెప్పపాటులో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శంకరపట్నం మండలం తాడికల్ వద్ద కౌశిక్ రెడ్డి కాన్వాయ్‌కు ఓ బైక్ అడ్డుగా వచ్చింది. దానిని తప్పించబోయి రోడ్డు పక్కన చెట్టును కారు ఢీ కొంది. పక్కనే గల పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) బయటపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నుంచి హుజురాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 2కే రన్లో పాల్గొనేందుకు వస్తున్నారు. ఆ క్రమంలో ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఓ భారీ వృక్షం ఉంది. దానిని ఢీ కొట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బైక్‌పై వస్తోన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కావడంతో హుజురాబాద్ ఆస్పత్రికి తరలించారు. మరో కారులో కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) హుజురాబాద్ వెళ్లిపోయారు. కౌశిక్ రెడ్డికి ప్రాణాపాయం తప్పడంతో అతని కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.