దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్లపై వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రభావం పడింది. పెట్టుబడుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ అమెరికాలో అదానీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు రూ.2.2 లక్షల కోట్లు నష్టపోయాయి.