GNTR: మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని యువకుడు బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. లాలాపేట పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరా ప్రియదర్శినికి చెందిన బొమ్మారెడ్డి పద్మావతి సోమవారం ఇంటి నుంచి రోడ్డుపై వెళ్తుండగా ఆమె వెనుక ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు బంగారపు గొలుసు లాక్కుని పరారయ్యాడు. చైన్ విలువ రూ.2లక్షలు ఉంటుందని ఆమె తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.