KMM: కొనిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని బొడియ తండా కట్టేబోడు బ్రిడ్జివద్ద సోమవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి ఎన్ఎస్పీ కాలువలో బోల్తాపడింది. ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి వివరాలను సేకరిస్తున్నారు.